Nani 30: స్టార్​ హీరోయిన్​​..కీ రోల్!

Hyderabad: నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా, ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కథానాయికగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నాని 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్​గ్లింప్స్​తోనే అంచనాలు పెంచేసింది. Nani30 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతీ హాసన్(Shruti Haasan)  కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నాని, శ్రుతీ హాసన్​ కలిసి మొదటిసారిగా తెరపై కనిపించనుండటంతో వీళ్లద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయోనని  ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

నాని 30వ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతునున్నారు. దీనిని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అనౌన్స్ చేశారు. డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన వీడియోస్ చూస్తే అది తెలుస్తుంది.  నాని 30 చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగ రాయ్’ చిత్రాలకూ ఆయన పని చేశారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.