Salman: భ‌య‌మేస్తోంది.. దేవుడిపైనే భారం వేసా

Mumbai: బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్‌(salman khan)కు ఎన్నో ఏళ్ల నుంచి బెదిరింపులు వస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌స్థాన్‌కు చెందిన లారెన్స్ బిష్ణోయ్(lawrence bishnoi) అనే గ్యాంగ్‌స్ట‌ర్.. స‌ల్మాన్‌ను టార్గెట్ చేసాడు. ఇప్ప‌టికే చాలా సార్లు చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. దాంతో ముంబై ప్ర‌భుత్వం స‌ల్మాన్‌కు Y+ సెక్యూరిటీ క‌ల్పించింది. దీని గురించి స‌ల్మాన్ స్పందించారు. “నాకు ముంబై రోడ్ల‌పై సైకిల్ వేసుకుని వెళ్ల‌డం ఇష్టం. కానీ నా చుట్టూ తుపాకీల గురి ఉంది. నేను ఇప్పుడు స్వేచ్ఛ‌గా తిర‌గ‌లేను. ట్రాఫిక్‌లో నా ఫ్యాన్స్ పాపం ఫొటోల కోసం ఎంతో త‌పిస్తుంటారు. నా వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డ‌టం నాకు ఇష్టం లేదు. అందుకే బ‌య‌టికి వెళ్ల‌డం త‌గ్గించా. ఒక‌వేళ వెళ్తే మాత్రం ఫుల్ సెక్యూరిటీతో వెళ్తున్నా. చాలా మందికి 100 ల‌క్కీ ఛాన్సులు ఉంటాయేమో కానీ నాకు మాత్రం ఒక్క‌టే ఉంది. అందుకే జాగ్ర‌త్త ప‌డుతున్నా. ఇలా జ‌ర‌గాల‌ని రాసి పెట్టి ఉంటే మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా అలానే జ‌రుగుతుంది. చాలా భ‌యంగా ఉంది. ఆ దేవుడిపైనే భారం వేసాను” అని వెల్ల‌డించారు.