Agent: దిక్కుమాలిన ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ్‌.. “ఏజెంట్” విల‌న్ ఆవేద‌న‌

Hyderabad: అఖిల్ అక్కినేని(akhil akkineni) న‌టించిన ఏజెంట్(agent) సినిమాలో విల‌న్‌గా క‌నిపించి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు బాలీవుడ్ న‌టుడు డినో మోరియా(dino morea). ఇది డినోకి ఫ‌స్ట్ తెలుగు సినిమా. ఏజెంట్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ విల‌న్ క్యారెక్ట‌ర్‌లో డినోకి మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే త‌న‌కు బాలీవుడ్‌లో దిక్కుమాలిన ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు డినో. నిజం చెప్పాలంటే నాకు బాలీవుడ్‌లో చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ నేను ఓకే చేయ‌డం లేదు. ఎందుకంటే అవి ఎంత దిక్కుమాలిన రోల్స్ అంటే.. అలాంటివి చేస్తే నా ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతారు. చెత్త రోల్స్‌లో న‌టించి కెరీర్‌లో ఐదు అడుగులు వెన‌క్కి వేయడం కంటే.. కాస్త వెయిట్ చేసి మంచి రోల్ చేసి ఒక్క అడుగు ముందుకు వేయడం బెట‌ర్ అనిపించింది. ఏజెంట్‌లో నా రోల్ నాకెంతో న‌చ్చింది. ఒమ‌న్‌లో షూటింగ్ స‌మ‌యంలో కాస్త ఇబ్బందిప‌డ్డా. ఎందుకంటే అక్క‌డ ఎండ‌లు చంపేస్తున్నాయ్. ఏదేమైనా నాకు ఏజెంట్‌లో ఆ క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాంటి క్యారెక్ట‌ర్స్‌నే నేను బాలీవుడ్ నుంచి కూడా ఆశిస్తున్నా అని తెలిపారు.