“ఐష్‌ని సినిమాలు చెయ్యనివ్వు..నువ్వు పాపని చూస్కో”
Mumbai: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్(abhishek bachchan)తో పోలిస్తే.. ఆయన భార్య ఐశ్వర్య రాయ్(aishwarya rai)కే పాపులారిటీ ఎక్కువ. ఐష్(aishwarya) ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పటికీ బాలీవుడ్ క్వీన్‌గానే కొనసాగుతోంది. ఐష్‌కి వచ్చినన్ని అవకాశాలు అభిషేక్‌కి రాలేదు. సంపాదనపరంగా కూడా ఐషే టాప్‌లో ఉంది. ఇదే విషయమై ఓ నెటిజన్ అభిషేక్‌ను కించపరిచేలా ట్వీట్ చేసాడు. ఐష్ కీ రోల్లో యాక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ అయిన నేపథ్యంలో అభిషేక్ ఓ ట్వీట్ పెట్టాడు. పొన్నియిన్ సెల్వన్ చాలా బాగుందని, టీం అంతా ఫెంటాస్టిక్‌గా నటించారని, ముఖ్యంగా తన భార్య అదరగొట్టేసిందని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కి ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ.. “మీరు ఐశ్వర్యను సినిమాలు చెయ్యనివ్వండి. మీరు ఇంట్లో కూర్చుని ఆరాధ్యను చూసుకోండి” అని ఎగతాళి చేసాడు. దీనికి అభిషేక్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. “నేను సినిమాలు చెయ్యనివ్వడం ఏంటండి. సర్.. నా భార్యకు సినిమాలు చేయడానికి నా పర్మిషన్ అవసరం లేదు. అందులోనూ తనకు నచ్చింది చేయడానికైతే అసలు అవసరం లేదు” అని రిప్లై ఇచ్చాడు. దాంతో అభిషేక్‌ను చాలా మంది నెటిజన్స్, ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అభిషేక్. భార్య సంపాదన, తండ్రి సంపాదనపై ఆధారపడుతున్నాడని నానా మాటలు అనేవారు. అలాంటివారికి ఓర్పుగానే సమాధానం ఇచ్చి నోరుమూయించేవాడు అభిషేక్.