China: చెవిలో నొప్పి.. డాక్ట‌ర్లు షాక్!

China: చెవి(ear pain)లో నొప్పంటూ డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళితే… చెవి(ear)లో సాలీడు(spider) గూడు పెట్టుకుని ఉండ‌టం చూసి షాక్ అవ‌డం డాక్ట‌ర్ల వంతైంది. ఈ ఘ‌ట‌న చైనా(china)లో చోటుచేసుకుంది. సిచువాన్ ప్రావిన్స్‌కి చెందిన ఓ మ‌హిళ చెవిలో ఏదో రింగ్ అవుతున్న‌ట్లు.. నొప్పిగా ఉంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించింది. దాంతో డాక్ట‌ర్లు ఆమెకు ఎండోస్కోపీ చేసారు. తీరా చూస్తే ఓ సాలీడు గూడు క‌ట్టి ఏకంగా పిల్ల‌ల్ని పెట్టేసింది. అది చూసి డాక్ట‌ర్లు షాక‌య్యారు. వెంట‌నే ఆ సాలీడుని బ‌య‌టికి లాగేసారు. ఆ స‌మ‌యంలో సాలీడు ఎండోస్కోపీ ట్యూబ్‌ని కొరికేసింద‌ట‌. ఎండోస్కోపీకి కెమెరాను ఎటాచ్ చేసి లోప‌లికి పంప‌డంతో అక్క‌డ ఉన్న‌దంతా రికార్డు అయింది. ఎండోస్కోపీ లోపలికి పంపిన‌ప్పుడు ఏమీ క‌నిపించ‌లేద‌ని కాసేప‌టికి ఏదో క‌దులుతున్న‌ట్లు అనిపించింద‌ని డాక్టర్లు తెలిపారు. ఆ సాలీడు విష‌పూరితం కాదు కాబ‌ట్టి స‌రిపోయింద‌ని లేదంటే మ‌హిళ ప్రాణానికే ప్ర‌మాదం అని తెలిపారు. చెవి లోప‌లి భాగంలో స్వ‌లంగా గాయం అయింద‌ని పేర్కొన్నారు. ఇలా నొప్పిగా అనిపించిన‌ప్పుడు సొంత ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా వెంట‌నే వైద్యుల వ‌ద్ద‌కు వెళితే మంచిద‌ని హెచ్చ‌రిస్తున్నారు.