rahul gandhi: ఉచిత ప్రయాణం..తొలిరోజే పథకాలు అమలు!
bengaluru: కర్నాటకలో ఎన్నికల(karnataka elections) ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(congress leader rahul gandhi)చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీ(bjp)పై నిపులుచెరుగుతున్నారు. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి పాలన సాగిస్తోందని రాహుల్ ఆరోపించారు. కమీషన్ల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు దిగజారిపోయారని.. ఇలాంటి అవినీతి పాలనను ప్రజలు అంతం చేయాలని సూచించారు. ప్రధానంగా మోదీనే లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ అన్నీ అబద్దాలే చెబుతారని, ఆయన హామీలను పట్టించుకోవద్దని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ అయిదు హామీలను ప్రకటించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ఈ అయిదు హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు.
తాను గతంలో కర్నాటకలో చేపట్టిన జూడో యాత్ర(judo yathra), ప్రస్తుతం చేస్తున్న పర్యటనలో భాగంగా ప్రజల ఇబ్బందులను గుర్తించినట్లు రాహుల్ పేర్కొన్నారు. అందుకే ప్రజలకు ఉపయోగపడే అయిదు పథకాలను తీసుకొచ్చామన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కోసం ఈ పథకాలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మహిళలు, యువకులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఆయన ప్రకటించిన పథకాలు(schemes) ఇలా.. గృహ లక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేలు చొప్పున ఇస్తామన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామన్నారు. పేదలకు పది కేజీల బియ్యాన్ని అన్న భాగ్య పథకం కింద. యువనిధి పథకం కింద డిగ్రీ నుంచి డిప్లొమా చదివిన నిరుద్యోగులకు మూడు వేల వరకు నిరుద్యోగ భృతి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని రాహుల్ స్పష్టం చేశారు. పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాలను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.