రిలీజైన‌ వారానికే బ్లాక్‌బ‌స్ట‌ర్లు..!

Hyderabad: తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ విడుదలైన 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం విడుదలై వారం లోపు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాలేంటో చూద్దాం..
విరూపాక్ష
సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్ జంటగా నటించిన సినిమా ‘విరూపాక్ష’(Virupaksha). కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
దసరా
నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా నటించిన మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
బలగం
తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన హృద్యమైన చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘బలగం’ సినిమా మార్చి 3న విడుదలైంది. ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
దాస్ కా ధమ్కీ
ఉగాది కానుకగా మార్చి 22న విడుదలైన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విశ్వక్ సేన్ హీరో, విలన్‌గా కూడా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
సార్
ధనుశ్ హీరోగా నటించిన ‘సార్’ మూవీ మార్చి 17న విడుదలైన మంచి టాక్‌తో తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా వారం లోపే బ్రేక్ ఈవెన్ సాధించింది.
వాల్తేరు వీరయ్య
జనవరి 13న విడుదలైన చిరంజీవి(Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి సీజన్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. రిలీజైన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.