Devi Sri Prasad: ఇంటర్నేషనల్​ మ్యూజిక్​ ఆల్బమ్​ కవర్​పై DSP!

Hyderabad: టాలీవుడ్ రాక్ స్టార్(Rock Star) దేవి శ్రీ ప్రసాద్(Devi sri Prasad) పేరు చెబితే చాలు దక్షిణాదితోపాటు బాలీవుడ్​(Bollywood) కూడా ఊగిపోతుంది. తన సంగీతంతో మాస్ ఆడియన్స్ ని మాత్రమే లవర్స్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని కూడా అలరిస్తుంటారు. దేవి(Devi) సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన దేవిశ్రీ.. సింగర్ గా, లిరిక్ రైటర్ గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించిన దేవి బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు పని చేశారు. ఇక పుష్ప 1 (Pushpa 1) సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు.

‘శ్రీవల్లి, ఊ అంటావా ఊఊ అంటావా, సామి’ పాటలతో దేశంలోని ప్రతి ఒకర్ని స్టెప్పులు వేసేలా చేశారు. కేవలం ఇండియాలోనే కాదు ఫారిన్ సింగర్స్ కూడా ఈ మ్యూజిక్ కి ఫిదా అయ్యిపోయారు. ప్రస్తుతం అందరూ పుష్ప 2లో దేవి ఎటువంటి పాటలతో రానున్నాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, తాజాగా దేవిశ్రీ ప్రసాద్ అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన లెజెండరీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మ్యాగజైన్ రోలింగ్ స్టోన్ (Rolling Stone) కవర్ పేజీ పై దేవిశ్రీ ప్రసాద్ స్థానం దక్కించుకున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ రోలింగ్ స్టోన్ చేసిన ట్వీట్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ‘తన మ్యూజిక్ స్టైల్ తో, చార్ట్ బస్టర్ హిట్స్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్.. ఈ నెల మా మ్యాగజైన్ పేజీని కవర్ చేశారు’ అంటూ కవర్ పేజీ ని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం పుష్ప 2, సూర్య కంగువ, పవన్ కల్యాణ్​ ఉస్తాద్ భగత్ సింగ్, గేమ్​ ఛేంజర్​ సినిమాలు దేవిశ్రీ చేతిలో ఉన్నాయి.