karnataka elections: వొక్కళిగ కోటలో బీజేపీ జెండా ఎగురుతుందా?
bengaluru: కర్నాటకలో ఎన్నికలు(karnataka elections) సమీపిస్తున్న కొద్దీ.. ప్రధాన పార్టీల నాయకులు ప్రచారం జోరందుకుంది. పక్కా ప్రణాళికలను ఆయా పార్టీలు అమలు చేస్తున్నాయి. అయితే.. కర్నాటకలో కులాలు, మతాలు ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో అన్ని పార్టీలు కులసమీకరణాలు, ఇతర అంశాలపై దృష్టి సారించాయి. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం.. వొక్కళిక సామాజిక(vokkaliga community) వర్గంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెండో అతి పెద్ద సామాజిక వర్గం వొక్కళిగలు.. వీరు తొలి నుంచి జేడీఎస్(jds)కు మద్దతుగా ఉంటున్నారు. ఎందుకంటే జేడీఎస్ వ్యవస్థాపకులు దేవగౌడ(deva gowda).. ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు. పాత మైసూరు ప్రాంతాల్లో వొక్కళిగా సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అక్కడ సుమారు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుంది. దీంతో కనీసం 30 స్థానాల్లో గెలుపొందాలని జేడీఎస్ భావిస్తోండగా.. బీజేపీ(bjp), కాంగ్రెస్(congress)లు కూడా అక్కడ సీట్లు పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నాయి.
బీజేపీ ఇప్పటికే వొక్కళిగాలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచింది.. ఇది వారికి కలిసొచ్చే అంశం. దీంతోపాటు.. బెంగళూరు ఎయిర్‌పోర్టుకు కెంపె గౌడ పేరు పెట్టడం, టిప్పు సుల్తానులను ఎదురొడ్డి పోరాడింది ఇదే సామాజిక వర్గం అంటూ చెప్పడం వంటివి.. వొక్కళిగలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే క్రమంలో జేడీఎస్ గ్రాఫ్ కూడా పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో వొక్కళిగాల ఓట్లు చేజిక్కించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా.. మోదీ, అమిత్ షా బహిరంగ సభలు కూడా ఆ సామాజిక వర్గాలు ఉన్న ప్రాంతాల్లోనే కేంద్రీకరించారు. ఫలితంగా కర్నాటకలో హంగ్ అసెంబ్లీ రాకుండా.. బీజేపీ సంపూర్ణ మద్దతు కూడగట్టుకునేందకు చూస్తోంది. వాస్తవానికి పాత మైసూర్‌లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకే బలం ఎక్కువ. బీజేపీకి కోస్టల్, సెంట్రల్ కర్నాటకలో బలం ఉంది. దీంతో ఏవిధంగానైనా పాత మైసూర్‌లో ఎక్కువ సీట్లు రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.