Rapido: ఏపీ డ్రైవ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌..బైక్ నుంచి దూకేసిన యువ‌తి

Bengaluru: ర్యాపిడో(rapido) బైక్ బుక్ చేసుకున్న యువ‌తితో డ్రైవ‌ర్ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. దాంతో ఆమె బైక్(rapido) నుంచి దూకేసిన ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఓ యువ‌తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. డ్రైవ‌ర్ ఆమెను ఎక్కించుకున్నాడు. అయితే దారి మ‌ధ్య‌లో ఓటీపీ కోసం ఆమె ఫోన్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత వేరే మార్గంలో వెళ్లాడు. అంతేకాకుండా ఆమెను కౌగ‌లించుకోవ‌డానికి య‌త్నించాడు. దాంతో అనుమానం వ‌చ్చి ఆ యువ‌తి బైక్ నుంచి దూకేసింది. రోడ్డుపై ప‌డ‌టంతో స్వల్పంగా గాయాల‌య్యాయి. అదే ప్రాంతంలో బీఎంఎస్ కాలేజ్ వాచ్‌మెన్ డ్యూటీలో ఉండ‌టంతో యువ‌తి కాపాడాడు. అప్ప‌టికే డ్రైవ‌ర్ బైక్ వేసుకుని పారిపోయాడు. నిందితుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన దీపక్ రావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో వైర‌ల్‌గా మారింది.