Ntr: తార‌క్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని ఉందన్న హాలీవుడ్ డైరెక్ట‌ర్

Hyderabad: RRR సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ అయిపోయాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(jr ntr). ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ డైరెక్ట‌ర్ల వ‌ర‌కు తార‌క్‌(jr ntr)తో క‌లిసి ప‌నిచేయాల‌ని ఎంతో ఆశ‌ప‌డుతున్నారు. ఇప్పుడు హాలీవుడ్ డైరెక్ట‌ర్ జేమ్స్ గ‌న్(james gunn).. తార‌క్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్లడించారు. నేను RRR సినిమా చూసాను. అందులో ఆ యాక్ట‌ర్ ఎవ‌రు? కేజ్ నుంచి జంతువుల‌తో క‌లిసి బ‌య‌టికి దూకుతాడు క‌దా అత‌ను ఎవ‌రు? అత‌నితో క‌లిసి ప‌నిచేయాల‌ని ఉంది. అమేజింగ్ యాక్ట‌ర్ అని ప్ర‌శంస‌లు కురిపించారు. గార్డియ‌న్స్ ఆఫ్ ది గెలాక్సీ(guardians of the galaxy)ని డైరెక్ట్ చేసిన జేమ్స్ గ‌న్ కుదిరితే తార‌క్‌ను మార్వెల్ యూనివ‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని ఉంద‌ని త‌న కోరిక‌ను వెల్ల‌డించారు. ఇప్ప‌టికే తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసారు. య‌శ్ రాజ్ ఫిలింస్ తెర‌కెక్కిస్తున్న వార్2లో తారక్ న‌టించ‌నున్నారు. హృతిక్ రోష‌న్, తార‌క్ మ‌ధ్య వావ్ అనిపించేలా ఫైటింగ్ సీన్స్ ఉండ‌బోతున్నాయ‌ని అంటున్నారు. ఇక తార‌క్ త్వ‌ర‌లో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తే ఫ్యాన్స్‌కి పండ‌గే