shaakuntalam: బాహుబలి హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు
Hyderabad: టాలీవుడ్ క్వీన్ సమంత(samantha) టైటిల్ రోల్లో నటించిన సినిమా శాకుంతలం(shaakuntalam). గుణశేఖర్(gunasekhar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనుకోని విధంగా ఫెయిల్ అయింది. సమంత కెరీర్లోనే డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా ఫెయిల్యూర్‌పై సీనియర్ నటి మధుబాల(madhubala) స్పందించారు. ఇందులో మధుబాల(madhubala) శకుంతల తల్లి మేనక పాత్రలో నటించారు. “అసలు సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. అసలు శాకుంతలం సినిమా ఫ్లాప్ అవుతుందని మేం ఎవరూ అనుకోలేదు. చాలా బాధేసింది. టీం అంతా ఎంతో కష్టపడింది. మమ్మల్ని కూడా కష్టపెట్టకుండా కంఫర్ట్‌గా చూసుకున్నారు. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ పైనే ఏడాది పాటు పనిచేసారు. అయినప్పటికీ ఫలితం రాలేదు. ఇప్పుడు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. అవి ఎందుకు హిట్ అయ్యాయో చెప్పలేం. బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంతటి హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఫ్లాప్ అవుతుందని అనుకోనప్పుడు ఆ సినిమా ఆడకపోతే చాలా బాధగా ఉంటుంది.” అని వెల్లడించారు మధుబాల.