Dasara డైరెక్టర్​తో చిరంజీవి సినిమా ఫిక్స్!

Hyderabad: సెకండ్ ఇన్నింగ్స్‌ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి(Chirajeevi) ఖైదీ నంబర్ 150 తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ స్పీడ్ పెంచిన చిరు.. వరుస సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు. పోయినేడాది ఆచార్య(Acharya), గాడ్ ఫాదర్(God Father) సినిమాలతో సందడి చేశారు.

ఇక, ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు, వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా కూడా నిలిపారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ ఇచ్చిన జోరుతో మరింత స్పీడ్ గా తర్వాతి సినిమాను పూర్తి చేస్తున్నారు చిరు. ఆగస్టు 11వ తేదీన తన తదుపరి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇటీవల ‘దసరా’(Dasara) మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) మీద చిరు దృష్టి పడిందని తెలుస్తోంది. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి సారధ్యంలోనే తన రెండో సినిమా కూడా చేయబోతున్నాడు శ్రీకాంత్. చిరంజీవికి శ్రీకాంత్ ఒక లైన్ చెప్పారని, శ్రీకాంత్‌కు కూడా ఇనీషయల్‌గా హామీ ఇచ్చి.. కథ మీద వర్క్ చేయమన్నారట చిరు. అంటే లైన్ ఓకే, ఫుల్ స్క్రిప్టు కూడా నచ్చితే సినిమా చేస్తా అనేది చిరంజీవి మాట.

నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) ​ జంటగా నటించిన దసరా సినిమా చూసి ఇంప్రెస్ అయిన చిరంజీవి.. మంచి కథ చెబితే మిగతా వాళ్లను పక్కన పెట్టి శ్రీకాంత్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతారని టాక్. మరి శ్రీకాంత్ ఇప్పుడు ఎంత మంచి కథతో వస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.