Tamannah: మ‌ళ్లీ అత‌నితోనే మిల్కీ బ్యూటీ నైట్ డిన్న‌ర్!

Mumbai: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా(tamannah).. బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ(vijay verma) ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇద్ద‌రూ ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు నోరు విప్పింది లేదు. ఫ్రెండ్స్ అనీ చెప్ప‌లేదు అలాగ‌ని ల‌వ‌ర్స్ అని కూడా అన‌లేదు. అయితే నిన్న రాత్రి త‌మ‌న్నా..విజ‌య్ వ‌ర్మ ఒకే కారులో ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు డిన్న‌ర్‌కు వెళ్లారు. అప్పుడు అక్క‌డే ఉన్న ఫొటోగ్రాఫ‌ర్లు చ‌క‌చకా ఫొటోలు తీసేసారు. త‌మ‌న్నా సిగ్గుప‌డుతూ క‌నిపించారు. ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ సెట్స్‌లో వీరిద్ద‌రూ క‌లిసార‌ట‌. అప్ప‌టినుంచి ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్తున్నార‌ని, త్వ‌ర‌లో త‌మ ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌నున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ఎంసీఏ సినిమాలో విజ‌య్ వ‌ర్మ విల‌న్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.