BTS సింగ‌ర్‌లా క‌నిపించాల‌ని యాక్ట‌ర్ స‌ర్జరీలు..మృతి

south korea:  సాధార‌ణంగా ఫ‌లానా యాక్ట‌ర్‌లా క‌నిపించాలనో,(bts singer) లేదా ఫ‌లానా హీరోయిన్‌లా అందంగా ఉండాల‌నో స‌ర్జ‌రీలు(surgeries) చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇక్క‌డ మాత్రం ఓ యాక్ట‌రే.. మ‌రో సింగ‌ర్‌లా క‌నిపించాల‌ని స‌ర్జ‌రీ చేయించుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న సౌత్ కొరియాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళితే.. సెయింట్ కోలూచీ అనే కెన‌డియన్ యాక్ట‌ర్.. కొంతకాలం క్రితం సౌత్ కొరియాకు వెళ్లిపోయాడు. అక్క‌డ బీటీఎస్ బ్యాండ్ చాలా పాపుల‌ర్‌. అందులో జిమిన్ అనే సింగ‌ర్ అంటే కోలూచీకి ఎంతో అభిమానం. అత‌ని ముఖంలా క‌నిపించాల‌ని త‌న ముఖాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 12 స‌ర్జ‌రీలు చేయించుకున్నాడు. వీటికోసం ఏకంగా 2,20,000 డాల‌ర్లు ఖ‌ర్చుపెట్టాడు. గెడ్డం ద‌గ్గ‌ర‌, చెంప‌ల దగ్గ‌ర ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీలు, ఇంజెక్ష‌న్లు చేయించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల‌కు సర్జ‌రీ అయిన చోట ఇన్‌ఫెక్ష‌న్ అయింది. అది కాస్తా తీవ్రం కావ‌డంతో కోలూచీ చ‌నిపోయాడు.

“కోలూచీకి త‌న ముఖం త‌న‌కు న‌చ్చేది కాదు. ఎలాగైనా త‌న రూపురేఖ‌లు మార్చ‌కోవాల‌ని అనుకున్నాడు. కానీ ఇలా జ‌రుగుతుంద‌ని అస్సలు ఊహించ‌లేదు. మ్యూజిక్ కెరీర్ కోసం కెన‌డా నుంచి సౌత్ కొరియాకు వెళ్లాడు. అక్క‌డ ఆఫ‌ర్ల కోసం వెతుకుతున్నప్ప‌టికీ ఎవ‌రూ ఇవ్వ‌లేదు. ఎందుకంటే అత‌నికి వెస్ట్ర‌న్ లుక్స్ ఉన్నాయి. దాంతో హేళ‌న చేస్తున్నార‌ని ఎంతో ఫీల‌య్యేవాడు” అని కోలూచీ అసిస్టెంట్ తెలిపాడు.