Sharmila: వచ్చేది మా ప్రభుత్వమే కేసీఆర్ అంతు చూస్తా

hyderabad: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల(ysr tp chief  ys sharmila) ఇవాళ జైలు నుంచి బెయిల్‌(bail)పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పిల్లిని కాదు పులిని. రాజశేఖర్ రెడ్డి(rajashekar reddy) భార్యను కేసీఆర్ అవమానించాడు.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను కేసీఆర్ జైలులో పెట్టించాడు .. అంతకు అంత కేసీఆర్ అనుభవిస్తాడు’ అని షర్మిల మండిపడ్డారు. తనపై దాడి చేస్తారనే కారణంతోనే పోలీసులను నెట్టేశానని తెలిపారు. రానున్నది తమ ప్రభుత్వమేనని కేసీఆర్ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. బోనులో పెట్టినా పులి.. పులినేనని అన్నారు. అరెస్టు వారెంట్‌ కూడా ఇవ్వకుండా తనను పోలీసులు జైల్లో ఉంచారని అన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పుడు మహిళా పోలీసులు లేరని చెప్పారు. తన కారుకు అడ్డుపడటానికే కారణమేంటో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడబోనన్నారు. మీరు ఎంత తొక్కాలని చూస్తే అంతా స్పీడ్ తో పైకి ఎదుగుతానని తెలిపారు. ఈ రాష్ట్రం ఆఫ్గనిస్తాన్ లా మారిందని.. తాలిబన్ల పాలన నడుస్తోందని ఆమె విమర్శించారు.

పోలీసులను కేసీఆర్(cm kcr) కుక్కల్లా.. తొత్తుల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులు తనపై దాడి చేసిన వీడియోలు లేకుండా చేశారని చెప్పారు. వాళ్లకు కావాల్సిన వీడియోలు వాళ్లు వైరల్ చేసుకున్నారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు. తాను ప్రశాంతంగా సిట్‌కు వెళ్లి లేఖ ఇవ్వాలనుకున్నానని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. అసలు తెలంగాణ(telangana)లో కేసీఆర్ కు పాలన చేతనవుతుందా? అని ప్రశ్నించారు. ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా? అని ధ్వజమెత్తారు. ప్రతి పక్షాల గొత్తుక నొక్కడమే ఆయన పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.