Dunki: కశ్మీర్లో షారూఖ్ ఖాన్!
Hyderabad: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో తాను కమ్ బ్యాక్ కావడమే కాకుండా.. ప్లాప్ ల్లో ఉన్న బాలీవుడ్(Bollywood) కు కూడా ఊపిరిపోశాడు. రూ.1000 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకొని బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నాడు. ఇక, ఈ మూవీ ఇచ్చిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ ఆ సక్సెస్ ని అలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం షారుఖ్.. జవాన్ (Jawan), డంకీ (Dunki) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒక మూవీ షెడ్యూల్ పూర్తి కాగానే మరో సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు.
తాజాగా షారుఖ్ డంకీ సెట్స్‌లోకి అడుగు పెట్టాడు. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు కొత్త షెడ్యూల్ కాశ్మీర్ లో మొదలైంది. దీంతో షారుఖ్ అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలో కాశ్మీర్ లోని హోటల్ లో దిగిన షారుఖ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు. PK, సంజు వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత హిరానీ నుంచి వస్తున్న సినిమా కావడం, షారుఖ్ కూడా పఠాన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
షారుఖ్ నటిస్తున్న మరో సినిమా జవాన్. తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టు సమాచారం. నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా చేస్తున్నారని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ పాత్రని తెలుగులో అల్లు అర్జున్ (Allu Arjun) చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.