Salman khan న‌న్ను పెళ్లి చేసుకుంటావా..?

Dubai: ఐదు ప‌దుల వ‌య‌సులోనూ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్(salman khan) ఇప్ప‌టికీ ఇండియాలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ల‌లో ఒక‌డు. స‌ల్మాన్(salman) ఒప్పుకోవాలే కానీ పెళ్లి చేసుకోవాల‌ని ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. స‌ల్మాన్ న‌టించిన కిసీకా భాయ్ కిసీకీ జాన్(kisika bhai kisiki jaan) సినిమా స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న దుబాయ్‌లో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. స‌ల్మాన్‌ని(salman) చూసేందుకు వేల మంది ఫ్యాన్స్ వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఓ అమ్మాయి స‌ల్మాన్.. న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది. అది విన్న మ‌రో అబ్బాయి.. స‌ల్మాన్ పెళ్లి చేసుకోడు అని రిప్లై ఇచ్చాడు. దాంతో స‌ల్మాన్ తెగ సిగ్గుప‌డిపోయాడు. ఇక‌పోతే స‌ల్మాన్ న‌టించిన కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాకు మిక్స్‌డ్ రియాక్ష‌న్స్ వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ స‌ల్మాన్ క్రేజ్ వ‌ల్ల బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే వ‌సూళ్లు కురిపిస్తోంది. ఫ‌ర్హాద్ స‌మ్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. పూజా హెగ్డే హీరోయిన్‌. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్‌, భూమిక కీ రోల్స్‌లో న‌టించారు. త‌మిళంలో అజిత్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమా వీరమ్‌కు ఈ సినిమా రీమేక్‌గా తీసారు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన కాట‌మ‌రాయుడు సినిమాలోని కొన్ని సీన్స్‌ను కూడా రీమేక్ చేసారు.