Sharmila: బెయిల్‌ మంజూరు.. విజయమ్మ ఏమన్నారంటే?

hyderabad: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల(ysrt chief ys sharmila arrest)ను బంజారాహిల్స్ పోలీసులు నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై పలు సెక్షన్ల కింద అరెస్టు చేసిన పోలీసులు.. నిన్న నాంపల్లి కోర్టు(nampalli court)కు తీసుకెళ్లారు. ఇక షర్మిల కారుతో ఢీకొట్టడంతో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు చేశారు. ఈక్రమంలో కోర్టు రిమాండ్‌ విధించగా.. ఇవాళ ఉదయం షరతులతో కూడిన బెయిల్‌ను ఆమెకు మంజూరు చేశారు.

పోలీసులపై ఆగ్రహం…
అరెస్ట్ తర్వాత షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈక్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో విజయమ్మ పోలీస్ స్టేషన్ ఎదుటే నిరసన తెలిపారు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన బిడ్డను కలవడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని విజయమ్మ, పోలీసులను నిలదీశారు. ఇక తాజాగా ఇవాళ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి షర్మిల అరెస్టుకు నిరసనగా.. శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని విజయమ్మ(ys vijayamma) కోరారు.