Upasana: ఆడపిల్లే.. హింట్ ఇచ్చేసిన చరణ్!
Hyderabad: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), ఉపాసన(upasana) దంపతులు త్వరలో పండింటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో ఉపాసన డెలివరీ కాబోతోంది. ఇప్పటికే దుబాయ్‌లో ఉపాసన సీమంతం ఘనంగా జరిపారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా తన కోడలి సీమంత వేడుకను తన ఇంట్లోనే అట్టహాసంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో సందడి మొదలైంది. అయితే తనకు పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో చరణ్ హింట్ ఇచ్చేసారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాలో చరణ్ ఓ సాంగ్‌లో గెస్ట్‌గా కనిపించారు. ఈ నేపథ్యంలో ఓ నేషనల్ మీడియా మీ జీవితంలో జాన్ ఎవరు అని చరణ్‌ని అడగ్గా.. “నా మొదటి జాన్ ఉపాసన, నా రెండో జాన్ నా పెంపుడు కుక్క రైమ్.. ఇక నా మూడో జాన్ త్వరలో రాబోతోంది” అనేసారు. రాబోతోంది అన్నారు అంటే ఆడపిల్లే అయివుంటుందని నెటిజన్లు సంబరపడిపోతున్నారు. ఇకపోతే ఉపాసన.. హైదరాబాద్‌లోని తమ అపోలో హాస్పిటల్లోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.