మీ ల‌వ్ మ్యాట‌ర్ ప‌వ‌న్‌కి తెలిస్తే..?

Hyderabad: విరూపాక్ష(virupaksha) సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్(sai dharam tej). కార్తిక్ దండు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్. ధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లోనే ల్యాండ్‌మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సందర్భంగా త‌న‌ని ఇంత‌లా ఆద‌రించిన ఫ్యాన్స్ కోస‌మ‌ని వారితో ట్విట‌ర్‌లో చేసారు. ఆ ఫన్నీ చిట్‌చాట్ ఏంటో మీరూ చదివేయండి.

విరూపాక్ష సెకండ్ పార్ట్ ఎప్పుడ‌న్నా?
ముందు ఫ‌స్ట్ పార్ట్ ఎంజాయ్ చేద్దాం

పెళ్లి ఎప్పుడ‌న్నా?
నువ్వు చేసుకున్నాక‌. నీ పెళ్లి ఎప్పుడు?

హిందీ డ‌బ్బింగ్ ఎప్పుడు రిలీజ్?
మే5న

అన్నా మీది, ప‌వ‌న్‌ది సినిమా టైటిల్ లీక్ చేయొచ్చుగా?
నీదేం పోయింది. మ‌ళ్లీ నాకు తేజూ గారూ అని ఫోన్ వ‌స్తది

హీరోయిన్స్‌లో మీ క్ర‌ష్?
స‌మంత‌

చ‌ర‌ణ్ గురించి ఒక్క మాట‌లో చెప్పండి?
ఒక్క మాట‌లో అంటే క‌ష్టం

చిరంజీవితో సినిమా ఎప్పుడు?
ఆయ‌న పిలిచిన‌ప్పుడు

రోజుకి ఎన్ని పెగ్గులు తాగుతావ్ అన్నా?
నేను నీలాగ కాదు బ్రో

నీ ల‌వ్ గురించి ప‌వ‌న్ అన్న‌కు చెప్తే ఆయ‌న రియాక్ష‌న్ ఏంటి? అని ఓ ఫ్యాన్ అడిగితే అత్తారింటికి దారేది రిలీజ్ ఫంక్ష‌న్ టైంలో ఆయ‌న న‌వ్విన జిఫ్ పోస్ట్ చేసారు. ఇలా ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌దాగా ఫ్యాన్స్‌ను ఆట‌ప‌ట్టిస్తూ త‌న సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌తో ఆన్స‌ర్స్ చెప్పారు.