karnataka elections: ముస్లిం ఓటర్ల ప్రభావం ఎంత? వారి ఓట్లు ఎవరికి?

bengaluru: కర్నాటక ఎన్నికలు(karnataka elections) త్వరలో జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. ఇక మిగిలింది ఎన్నికల ప్రచారం.. ఆ తర్వాత పోలింగ్‌ మాత్రమే. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న పార్టీలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థులను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కర్నాటకలో తొలి నుంచీ బీజేపీ(bjp) మాత్రం హిందువుల(hindu votes target) ఓట్లే లక్ష్యంగా ఎన్నికల్లోకి వెళ్తోంది. కానీ దాదాపు 13 శాతం మంది ముస్లిం జనాభా కర్నాటకలో ఉన్నారు. వీరందరూ బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలకు మద్దతు ఇస్తారు. ఇక ఆ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224 ఉండగా.. అందులో ముస్లిం ఓటర్లు(muslim voters) అధికంగా ప్రభావితం చూపేవి 30 ఉన్నాయి.

ఇక మరో 70 సీట్లలో పాక్షికంగా వారి ప్రభావం ఉంటుంది. అయితే వీరి ఓట్లు కాంగ్రెస్‌(congress), జేడీఎస్‌(jds)లలో ఎవరికి పడతాయి అన్నదానిపై స్పష్టత లేదు. ఒక వేళ ఓట్లు చీలితే.. బీజేపీకి కలిసొస్తుందని కొందరి అనుకుంటున్నారు. ఇక జేడీఎస్‌ కర్నాటకు బీ టీం అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ వైపు ముస్లిం ఓటర్లు ఉంటారని అంటున్నారు. వాస్తవానికి ముస్లింల హక్కుల గురించి.. వారి సమస్యలపై ఈ రెండు పార్టీలు గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు. దీంతో అసలు ఈ రెండు పార్టీల కంటే.. ఎంఐఎం లేదా స్వతంత్ర అభ్యర్థులకు వారు ఓటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

బీజేపీ మాత్రం యాంటీ ముస్లిం అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. గతంలో కూడా హిజాబ్‌, హలాల్‌ మీట్‌ బాయ్‌కాట్‌, దేవాలయాలు వద్ద ముస్లిం వ్యాపారాలు వద్దని, లవ్‌జీహీద్‌ ప్రొటెక్షణ్‌, టిప్పు సుల్తాన్‌ అంశం, తాజాగా ముస్లింలకు ఉన్న ఓబీసీ రిజర్వేషన్‌ తీసేయడం వంటివి చేపట్టి.. హిందువులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేసింది. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కావడంతో అదే నినాదంతో ముందుకు వెళ్లోంది. మరి ఏ మేరకు వారు సక్సెస్‌ అవుతారో చూడాలి.