viveka case: అవినాష్‌కు బిగ్ షాక్.. అరెస్టు ఖాయమేనా?
Delhi: మాజీ మంత్రి వివేకా హత్య కేసు(viveka murder case)కు సంబంధించి.. విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్(mp avinash)ను ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు(telangana high court) ఇటీవల సీబీఐ(cbi) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే .. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం(supreme court)లో వివేకా కుమార్తె సునీత (sunitha)పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ పూర్తిగా ధర్మాసనం పూర్తిగా విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసుకోవచ్చని.. తెలంగాణ హైకోర్టు అరెస్టు చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను కొట్టిపారేసింది. సీబీఐ అధికారులు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకోవచ్చని.. కేసును వేగవంతంగా క్లోజ్ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో సునీత కొంత ఊరట పొందినట్లు కాగా.. ఈ పరిణామం మాత్రం ఎంపీ అవినాష్‌కి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. ఇక అవినాష్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు సీబీఐ అధికారులు.. ఈ కేసు విచారణకు సంబంధించి మరింత సమయం కావాలని.. కోరినట్లు సమాచారం. దీంతో మరో రెండు నెలల పాటు అధికారులు విచారణ చేయనున్నారు. పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తామని ధర్మాసనానికి వారు తెలిపారు.