Nagarjuna : అఖిల్ అందర్నీ పరిగెత్తించేవాడు!

Warangal: టాలీవుడ్​ యంగ్​ హీరో అక్కినేని అఖిల్(Akkineni Akhil), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా నటించిన సినిమా ఏజెంట్​(Agent). డైరెక్టర్​ సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్​ 28న విడుదల కానుంది. పూర్తి మాస్​ యాక్షన్​ సినిమాగా బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty)ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున అఖిల్​ గురించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఏజెంట్​ సినిమా గురించి మాట్లాడిన నాగార్జున అఖిల్​ గురించి మాట్లాడుతూ.. ‘ఇక వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి. వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కడుపులో ఉన్నప్పుడే ఉన్నపుడే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు. తనకి ఏడాదిన్నర ఉన్నప్పుడు రెస్ట్ లెస్ గా పరిగెత్తేవాడు. అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అంత చిన్నపిల్లలకి అలాంటి ఎనర్జీ వుండటం మేము ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వీడిలో ఎక్కువ ఎనర్జీ ఉంది, దాన్ని బయటికి లాగాలంటే నేలపై రోజుకో గంట సేపు పడుకోబెట్టండని చెప్పారు. సురేందర్ రెడ్డి గారు ఆ ఎనర్జీ అంతా తీసి సినిమాలో పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ పడుతున్న కష్టం కళ్ళారా చూశాను. ప్రేక్షకులు, అభిమానులు మా వెనుక లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది’ అన్నారు.