‘హరిహర వీరమల్లు’లో పవన్​ పాట!

Hyderabad: పవర్ స్టార్(Power Star) పవన్ కల్యాణ్(Pawan Kalyan)​ నటనలోనే కాదు 24 క్రాఫ్ట్స్​ మీద పట్టున్న హీరో. దర్శకత్వం, నటనతోపాటు ఆయన నటించిన పలు సినిమాల్లో పాటలు కూడా పాడి మెప్పించారు. అంతేకాదు పలు సినిమాల్లో ఫైట్స్​ కూడా  కంపోజ్​ చేశారు. మల్టీ టాలెంట్​తో ఆకట్టుకుంటున్న పవన్​ మరోసారి అభిమానులను అలరించేందుకు గొంతు సవరించబోతున్నారని తెలుస్తోంది.  సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ(Politics) రాణిస్తున్న పవన్​ చాలా అరుదుగా ఇతర విషయాలపై దృష్టి పెడతారు. కాగా, క్రిష్​ జాగర్లమూడి (Krish) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమాలో పవన్​ మరోసారి పాట పాడనున్నారని తెలుస్తోంది. ​

ప్రస్తుతం పవన్​ వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో సోషియా ఫాంటసీ చిత్రం ‘హరి హరవీర మల్లు. ఇలాంటి సినిమా చేయడం పవన్​ కెరీర్ లో ఇదే తొలిసారి. ఇప్పటికే రిలీజ్ అయిన పవన్ లుక్ సహా ప్రచార చిత్రాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వీరమల్లు కోసం గొంతు సవరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ఓ పాట పాడబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. సినిమాలో పవన్​ పాడే పాట టైటిల్ ట్రాక్ గా వస్తుందట. ఆ పాట ఆద్యంతం ఎమోషన్ గా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తోన్న ఎం ఎం కీరవాణి కోరిక మేరకు పవన్​ కల్యాణ్ గొంతు సవరిస్తున్నారని సమాచారం.