Agent: ఆలస్యానికి కారణమేంటో చెప్పేసిన అఖిల్​!

Hyderabad: టాలీవుడ్​ యంగ్​ హీరో అక్కినేని అఖిల్‌(Akhil Akkineni) నటించిన తాజా సినిమా ఏజెంట్​(Agent). అఖిల్​ తొలిసారి యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. స్పై యాక్షన్‌ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడి బాడీ బిల్డప్ చేశాడు కూడా. దీంతో ఏజెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. సురేందర్‌ రెడ్డి(Surendar Reddy) వంటి స్టైలిష్‌ డైరెక్టర్‌ ఈ సినిమాను తెరకెక్కించడంతో సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఏజెంట్‌ సినిమా ఏప్రిల్‌ 28న తెలుగుతో పాటు మలయాళంలోనూ రిలీజ్‌ కానుంది.

సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా అఖిల్​ ఓ ఇంటర్వ్యూలో  ఏజెంట్ సినిమా ఆలస్యానికి గల కారణాల్ని చెప్పుకొచ్చారు. ‘స్పై యాక్షన్ సినిమా చేయాలంటే హీరో చాలా ఫిట్‌గా ఉండాలి. అదే సమయంలో బాడీ షేప్‌ కూడా స్పై ఆఫీసర్‌‌ వలె ఉండాలి. దాని కోసం దాదాపు 10 నెలల సమయం తీసుకున్నాను. సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఆలస్యం కావడానికి అది కూడా ఒక కారణం. ఏజెంట్‌ సినిమాలో నా క్యారెక్టర్‌‌ వైల్డ్‌ మంకీని గుర్తు చేస్తుంది. ప్రతి దాని గురించి చాలా ఇంటెన్సివ్‌ గా మాట్లాడాలి. అయితే నాకు ఉన్న సిగ్గు కారణంగా అది చాలా కష్టపడాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు అఖిల్. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఏజెంట్‌ సినిమాలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి(Mammootty) కీలకపాత్ర పోషించగా.. సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా షూటింగ్‌ మొదలై దాదాపు రెండు సంవత్సరాలు గడిచింది. ఇప్పటికే పలుసార్లు సినిమా విడుదల డేట్స్ ఇచ్చి వాయిదా వేశారు కూడా. దీనికి కారణం ఏంటనే దానిపై అనేక రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో సినిమా కోసం కేటాయించిన సమయాన్ని గురించి అఖిల్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.