Warner: గంగమ్మ తల్లి గెటప్​లో డేవిడ్ వార్నర్!

Hyderabad: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​(Allu Arjun)కి దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ (Allu Arjun) సాంగ్స్ అండ్ డైలాగ్స్ ని రీల్స్ అండ్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ సర్​ప్రైజ్​ చేస్తుంటాడు. డేవిడ్ మాత్రమే కాదు అతని కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ ని విపరీతంగా అభిమానిస్తుంటారు.

తాజాగా డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్​ని అనుకరిస్తూ మరో గెటప్​తో అభిమానులకు కనువిందు చేశాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ కాళీమాత గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ గెటప్స్ ని పేస్ యాప్ ద్వారా ఎడిట్ చేసి తన పేస్ తో ఉన్న పిక్స్ పోస్ట్ చేసి డేవిడ్.. ఈ చిత్రాన్ని కూడా ఎడిట్ చేసి పెట్టాడు. అయితే ఈ పోస్ట్ తో పాటు మరో పిక్ ని కూడా షేర్ చేశాడు. ఆ పోస్ట్ UPI లావాదేవికి సంబంధించిన పిక్. డేవిడ్ వార్నర్ ఎవరికో రూ.10,001 పంపించినట్లు దానిలో కనిపిస్తుంది. అయితే పేరుని మాత్రం డేవిడ్ కవర్ చేశాడు. ఈ పోస్ట్ కి కామెంట్ ఇలా రాసుకొచ్చాడు.. ‘మొదటిసారి UPIని ప్రయత్నించాను. నేను దీనిని ఎవరికి పంపాను అనేది కూడా మీరు ఊహించలేరు’ అంటూ పోస్ట్ చేశాడు. ఆ డబ్బులు ఎవరికి పంపించాడో చెప్పకుండా సస్పెన్స్​లో పెట్టిన వార్నర్​ వాళ్ల పేరు రివీల్ చేస్తాడో లేదో చూడాలి. ఇక, పాన్​ ఇండియా రేంజ్​లో సక్సెస్​ సాధించిన పుష్ప(Pushpa) సినిమాకి సీక్వెల్​గా వస్తున్న పుష్ప2(Pushpa2)ని సుకుమార్(Sukumar)​ తెరకెక్కిస్తుండగా రష్మికా మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.