Balagam: చిన్న సినిమా ఖాతాలో ఎన్ని అవార్డులో!

Hyderabad: టాలీవుడ్​ కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి సినిమా బలగం(Balagam). ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ప్రముఖ నిర్మా దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఒక మనిషి చనిపోయిన తరువాత కుటుంబంలో చోటు చేసుకొనే విషయాలను కళ్ళకి కట్టినట్లు చూపించారు. సినీ అభిమానులతోపాటు టాలీవుడ్​ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి ఫిదా అవుతున్నారు.

చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం ఓటిటి లోనూ రికార్డు వ్యూస్​తో దూసుకుపోతోంది. ఓటీటీలో వచ్చినా థియేటర్లలో ఈ సినిమా హవా తగ్గడం లేదు. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ప్రేక్షకుల అందరికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సినిమా కలెక్షన్లు మాత్రమే కాదు అవార్డులు అందుకోవడంలో సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఇటీవల ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఇప్పటి వరకు 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను అందుకున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కి, అలాగే ఆస్కార్ కి కూడా బలగం చిత్రాన్ని పంపిస్తామని దిల్ రాజు తెలియజేశాడు.