Delhi: లాయ‌ర్ వేషంలో వ‌చ్చి.. మ‌హిళ‌పై కాల్పులు

Delhi: దిల్లీలో(delhi) దారుణం చోటుచేసుకుంది. సాకేత్(saket) ప్రాంతంలోని కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఓ దుండుగు మ‌హిళ‌పై కాల్పులు జ‌రిపాడు. లాయ‌ర్ వేషంలో వ‌చ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మ‌హిళ‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. డ‌బ్బుల విష‌యంలో పెట్టిన కేసు విష‌య‌మై మ‌హిళ కోర్టుకు వెళ్లారు. కోర్టు లోప‌లికి వెళ్తుండ‌గా లాయ‌ర్ గెట‌ప్‌లో ఉన్న వ్య‌క్తి వ‌రుస‌గా నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ గాయ‌ప‌డింది. రెండు రోజుల క్రితం ఇలాంటి ఘ‌టనే దిల్లీలో జ‌రిగింది. లాయ‌ర్ వేషాల్లో ఇద్ద‌రు బైక్‌పై వచ్చి మరో లాయ‌ర్‌ను కాల్చి చంపేసారు. దాంతో లాయ‌ర్ల ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని, వారికి క‌నీస‌ ర‌క్ష‌ణ క‌ల్పించాలని దిల్లీ హైకోర్టులో పిటిష‌న్ కూడా వేసారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో కోర్టు రూంలో ఇద్ద‌రు వ్య‌క్తులు లాయ‌ర్ల గెట‌ప్‌లో వ‌చ్చి గ్యాంగ్‌స్ట‌ర్‌పై కాల్పులు జ‌రిపారు. వారిని అడ్డుకున్నార‌ని పోలీసుల‌పై కూడా కాల్పులు జ‌రిపారు. దాంతో ఇద్ద‌రు పోలీసులు అక్క‌డికక్క‌డే చ‌నిపోయారు.