Twitter: సెల‌బ్రిటీల బ్లూ టిక్స్ మాయం!

Hyderabad: ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్(elon musk) ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. లాస్ట్ ఇయ‌ర్ 48 బిలియ‌న్ డాల‌ర్లు పెట్టి ప్ర‌ముఖ సోషల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ ట్విట‌ర్‌ను(twitter) కొనుగోలు చేసాడు ఎలాన్. అయితే ట్విట‌ర్‌లో(twitter) ఇప్ప‌టికే చాలా మార్పులు చేసిన ఎలాన్..(elon) ఇప్పుడు సెల‌బ్రిటీల ఎకౌంట్ల నుంచి బ్లూ టిక్స్(blue ticks) తొల‌గించేసాడు. ఇప్ప‌టికే అమితాబ్ బ‌చ్చ‌న్, షారుక్ ఖాన్‌, విరాట్ కోహ్లీ, ఆలియా భట్, మ‌న తెలుగు నటులు నాని, అల్లు అర్జున్ ప్ర‌కాష్ రాజ్‌ల‌ ఖాతాల‌కు బ్లూ టిక్స్ మాయ‌మైపోయాయి. అటు పొలిటిషియ‌న్ల ఎకౌంట్ల నుంచి కూడా బ్లూ టిక్స్ లేపేసాడు. ఇక నుంచి ఎకౌంట్‌కు బ్లూ టిక్ కావాలంటే స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అంటే వెబ్‌సైట్ నుంచి బ్లూ టిక్ కొనుగోలు చేయాలంటే నెల‌కు 8 డాల‌ర్లు చెల్లించాలి. అదే యాప్ నుంచి కొనుక్కోవాలంటే నెల‌కు 11 డాల‌ర్లు చెల్లించాల్సి ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే బ్లూటిక్స్ తొల‌గించ‌డంపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌కు బ్లూ టిక్ లేకపోయినా త‌న అభిప్రాయాల‌ను ట్విట‌ర్ ద్వారా షేర్ చేస్తుంటాన‌ని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు. బ్లూటిక్ కోసం అంత డ‌బ్బు చెల్లించాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని మండిప‌డుతున్నారు.