Review: Virupaksha
Hyderabad: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(sai dharam tej) యాక్సిడెంట్ తర్వాత కోలుకుని చేసిన మూవీ విరూపాక్ష(virupaksha). కార్తిక్ దండు డైరెక్ట్ చేసారు. సంయుక్త(samyukta) హీరోయిన్. ఈరోజే సినిమా రిలీజ్ అయింది. విరూపాక్షకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లోనూ మంచి టాక్ వస్తోందట. యాక్సిడెంట్ ముందు వరకు ప్రేక్షకులు చూసిన ధరమ్ తేజ్ వేరు ఇప్పుడు విరూపాక్షతో ఎంట్రీ ఇచ్చిన ధరమ్‌తేజ్ వేరు అని అంటున్నారు. నటనలో, ఎక్స్‌ప్రెషన్స్‌లో, స్టైల్లో ఏదో తెలీని మార్పు కనిపిస్తోందని, అది సినిమాకు ప్లస్ అయిందని ఫిలిం క్రిటిక్స్ చెప్తున్నారు. కార్తిక్ ఓ మంచి సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌తో సాయి ధరమ్ తేజ్‌కి కమ్‌బ్యాక్ ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. కార్తిక్.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇన్స్టిట్యూట్ నుంచే వచ్చాడు.
సో ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయట. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ప్లాటినం లెగ్ అని పేరు తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త. ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ వరకు చాలా బాగా యాక్ట్ చేసిందని మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు. టెక్నికల్ వర్క్ పుణ్యమా అని సెకండ్ హాఫ్ కూడా సీట్లకు అతుక్కుపోయేలా సీన్స్ తెరకెక్కించారట. సింపుల్‌గా చెప్పాలంటే సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ వారం విరూపాక్ష ది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు.