కూతురినే భార్యను చేసుకున్న కామాంధుడు
Britain: కన్నతండ్రే కూతుర్ని రేప్(rape) చేసి ఆమెను చిన్నప్పుడే భార్యను చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బ్రిటన్(britain)లో చోటుచేసుకుంది. 1980ల్లో ఇలియట్ అనే వ్యక్తిని భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఇతనికి కారోల్ అనే కూతురు ఉంది. కారోల్కి 13 ఏళ్లు ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ కారోల్కి అది తప్పని తెలీలేదు. నాన్న అంటే అలా చేయడం సాధారణమేనేమో అనుకుందట. అలా ఆమెను ఓ టాటూ పార్లర్కు తీసుకెళ్లి భుజంపై గులాబీ టాటూ వేయించి నువ్వే నా భార్యవు.. ఇలాగే సంతోషంగా ఉందాం అని చెప్పాడట. చిన్నప్పుడు తెలీకపోయినా కాస్త వయసు వచ్చాక తన తండ్రి నరరూప రాక్షసుడు అని కారోల్కి అర్థమైంది. దాంతో 1985లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా న్యాయస్థానం అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనకు జరిగిన ఘటన గురించి కారోల్ ఓ బుక్ రాయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. చిన్నప్పుడు నాన్న అలా చేస్తున్నా తనకు అర్థమయ్యేది కాదని, ఇప్పుడు ఇంకా ఆ నరకం నుంచి కోలుకుంటున్నానని తెలిపింది. తన బుక్ చదివాక అయినా తనలా తండ్రుల చేతిలో నలిగిపోతున్న అమ్మాయిలు ధైర్యంగా బయటికి వస్తారేమోనని ఆశిస్తోంది.