Virupaksha: ఆ సీన్లు ఉన్నాయా.. జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కు ధ‌ర‌మ్ తేజ్ సెటైర్

Hyderabad: సాయి ధ‌ర‌మ్ తేజ్(sai dharam tej) హీరోగా న‌టించిన వీరూపాక్ష(virupaksha) సినిమా రేపు రిలీజ్ అవ‌బోతోంది. కార్తిక్ వ‌ర్మ డైరెక్ట్ చేసారు. సంయుక్త(samyukta) హీరోయిన్‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. సినిమాకు ఏ స‌ర్టిఫికేట్ రావ‌డంపై ఓ జ‌ర్న‌లిస్ట్ వేసిన ప్ర‌శ్న‌కు.. టీం చెప్పిన ఆన్స‌ర్ కాస్త ఇబ్బందిక‌రంగా మారింది. “సినిమాకు ఏ స‌ర్టిఫికేట్ ఎందుకిచ్చారు. సినిమాలో మీకు సంయుక్త‌కు మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయా? లేక‌పోతే భ‌యంక‌ర‌మైన సీన్లు ఉంటాయ‌ని ఆ స‌ర్టిఫికేట్ ఇచ్చారా?” అని అడిగాడు. ఇందుకు ధ‌ర‌మ్ తేజ్, టీం స్పందిస్తూ.. “మీరు ఆ సీన్లు ఉంటాయ‌ని అనుకుంటున్నారా? మీకు చాలా గ్యాప్ వ‌చ్చిన‌ట్లుంది. ఆ సీన్లు ఏమీ ఉండ‌వు. కాక‌పోతే థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. అది చూసిన‌ప్పుడు గూస్‌బంప్స్ వ‌స్తాయి. అందుకే ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకానీ మీరు అనుకునే సీన్లు ఉండ‌వు. మ‌గ‌ధీర సినిమాకు కూడా ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. అందులో మీరు అనుకున్న సీన్లు అయితే లేవుగా. మీకోసం ప్ర‌త్యేకంగా సినిమా తీయ‌లేదు. అంద‌రికోసం తీసాం.” అని ధీటుగా స‌మాధానం ఇచ్చారు.