డబ్బుల్లేక.. కూతుర్ని అలా చూడలేక..
Bhopal: బాగా చదివే కూతురు.. కళ్లముందే నడకలేని స్థితిలో ఉండటం చూసి ఆ కన్నతండ్రి తట్టుకోలేకపోయాడు(madhya pradesh). కూతుర్ని అలా చూడలేక.. ట్రీట్మెంట్కి డబ్బుల్లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. సత్నా ప్రాంతానికి చెందిన అనుష్క గుప్త అనే బాలికకు ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. అప్పటినుంచి ట్రీట్మెంట్ కోసం అనుష్క తండ్రి ప్రమోద్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ఉన్న ఇంటిని అమ్మేసాడు. తిండి పెట్టే షాప్ను అమ్ముకోవాల్సి వచ్చింది. చివరకు డబ్బులు చాలక రక్తదానం కూడా చేసేవాడు. ఐదేళ్లు గడిచినప్పటికీ అనుష్క ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల జరిగిన పది పరీక్షల్లోనూ అనుష్క మంచంపై నుంచే పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. అటు కుటుంబీకుల సాయం లేక, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రమోద్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో అనుష్క పరిస్థితి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాయం చేస్తే కోలుకుని చదువుకుంటానని అనుష్క అంటోంది.