దేవిశ్రీ పాడిన పాట‌.. హార్ట్ ఎటాక్ వ‌చ్చేలా ఉందట‌!

Mumbai: బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్(salman khan) న‌టించిన మూవీ కిసీకా భాయ్ కిసీకీ జాన్(kisika bhai kisiki jaan). పూజా హెగ్డే(pooja hegde) హీరోయిన్‌. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్‌, భూమిక చావ్లా కూడా న‌టిస్తున్నారు. సినిమా రిలీజ్‌కి ముందే ఎన్నో ట్రోల్స్ వ‌స్తున్నాయి. సినిమాలో స‌ల్మాన్ లుక్ చూసి ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లా అని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఏంట‌మ్మా.. అనే సాంగ్ రిలీజ్ అయిన‌ప్పుడు కూడా స‌ల్మాన్ వాయిస్ ఓవ‌ర్‌, పాట‌కు వేసిన స్టెప్స్‌కి ఏమాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. 21కి సినిమా రిలీజ్ అవ‌బోతోంది. ఇప్పుడు ఈ సినిమాలోని లెట్స్ డ్యాన్స్ చోటూ మోటూ సాంగ్ రిలీజ్ చేసారు. మ‌రోసారి స‌ల్మాన్‌, వెంకీ లుంగీలు క‌ట్టుకుని ఈ పాట‌కు డ్యాన్స్ చేసారు. ఈ పాట‌ను యోయో హ‌నీ సింగ్, దేవిశ్రీ ప్ర‌సాద్ క‌లిసి పాడారు. పాట‌కు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్‌.. అనే ప‌దాల‌తో లిరిక్స్ రాసారు. దాంతో ఈ పాటపై కూడా మ‌ళ్లీ ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఈ పాట వింటుంటే కోమాకు వెళ్లిపోతామని, హార్ట్ ఎటాక్ వ‌చ్చేలా ఉంద‌ని కామెంట్లు పెడుతున్నారు. ఆ పాట ఎలా ఉందో ఓసారి మీరూ చూసేయండి.