Summer Holidays: విద్యార్థులకు సెలవులు..ఎంజాయ్ పండగో!
vijayawada: వేసవి ఎండలు(summer heat) ఒకవైపు ముదురుతున్నాయి. దీంతో పిల్లలకు ఇప్పటికే ఏపీ(ap), తెలంగాణ(telangana)ల్లో ఒంటి పూట బడులు(half day schools) ప్రారంభమయ్యాయి. పరీక్షలు కూడా అన్ని తరగతుల విద్యార్థులకు పూర్తి చేశారు. ఇక మిగిలింది సమ్మర్ హాలిడేస్(Summer holidays).. దీనిపై ఏపీలో కొంచెం సందిగ్ధం నెలకొనగా.. తెలంగాణలో మాత్రం అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించి. ఆ తర్వాత సెలవులు ఇవ్వాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హాలిడేస్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పరీక్షలు పూర్తయిన విద్యార్థులు కేవలం మరో రెండు రోజులు స్కూల్ కు వెళ్తే సరిపోతుంది. తెలంగాణలో ఏప్రిల్ 22, 23 తేదీలలో రెండురోజుల సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులు పాఠశాలలకు కూడా సెలవులు మంజూరు చేశారు. నెలవంకను బట్టి రంజాన్ పండుగను ఏప్రిల్ 22 లేదా 23న జరుపుకోనున్నారు. ఏప్రిల్ 22 ఈద్-ఉల్-ఫితర్ కారణంగా సెలవు దినం ప్రకటించబడగా.. ఏప్రిల్ 23 తర్వాత రోజు సెలవుగా డిక్లర్ చేయనున్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది.
ఏపీలో ఇలా..
ఏపీలో ఈ నెల 30 నుంచి 1-9 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నెల 27తో పరీక్షలు ముగియనుండగా.. రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించి.. పేరెంట్స్ మీటింగ్స్ మొదలైనవి నిర్వహించనున్నారు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో సెలవులను కాస్త ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. జూన్ 12 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.