Game Changer: క్లైమాక్స్ కోసం కమల్‌కి టాటా చెప్పిన శంకర్!
Hyderabad: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా పాటు ఇండియన్ 2 (Indian 2) ని కూడా తెరకెక్కిస్తున్నారు. 1996 లో కమల్ హాసన్(Kamal Hasan) హీరోగా తెరకెక్కిన భారతీయుడు(Bharateeyudu)కి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. నిజానికి చరణ్ సినిమా కంటే ముందు ఈ సినిమానే మొదలు పెట్టారు శంకర్. కానీ ఇండియన్ 2 మధ్యలోనే ఆగిపోవడంతో RC15 ని స్టార్ట్ ప్రారంభించారు. తరువాత ఇండియన్ 2 కి అడ్డంకులు తొలిగిపోవడంతో రెండిటినీ ఒకేసారి పూర్తి చేస్తున్నారు.
ఇటీవలే సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కోసం వెళ్లిన ఇండియన్ 2 టీం అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. దీంతో శంకర్ గేమ్ చెంజర్ కి షిఫ్ట్ అవ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శంకర్ తెలియజేశారు. కమల్‌కి బాయ్ చెబుతూ దిగిన ఫొటోని షేర్ చేస్తూ గేమ్ ఛేంజర్ షూటింగ్లో జాయిన్ అవబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ షూట్ చిత్రీకరించబోతున్నట్లు, మే నెల వరకు ఈ షెడ్యూల్ షూట్ ఉంటుందని, ఆ తరువాత మళ్ళీ ఇండియన్ 2 సెట్స్ లోకి చేంజ్ అవుతాను అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు శంకర్. కాగా పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.