World liver day: కాలేయంపై ఓ క‌న్నేసి ఉంచండి

Hyderabad: కాలేయం(liver) మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఇది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. నేడు వ‌ర‌ల్డ్ లివ‌ర్ డే సందర్భంగా కాలేయ(liver) సంబంధ సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

* కాలేయ వ్యాధులు వ్యాధి ముదిరే వరకు ఎటువంటి లక్షణాలు కనిపించవు.

*హెపటైటిస్‌ ఎ, హెపటైటిస్‌ బి, లివర్‌ సిర్రోసిస్‌, లివర్‌ క్యాన్సర్‌, నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ వంటి వ్యాధులు గతంలో కంటే ఇప్పుడు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.

* కామ‌న్ లివ‌ర్ వ్యాధులలో ఫ్యాటీ లివర్ వ్యాధి ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఇది లివ‌ర్‌ కణజాలానికి వాపు, హానిని కలిగించవచ్చు.  ల‌క్ష‌ణాలు క‌నిపించ‌న‌ప్ప‌టికీ కొన్ని సంకేతాలు వ్యాధి ఉనికిని సూచిస్తాయి.

* లివ‌ర్‌ పనితీరును మెరుగుపరచడంలో ఆహారానిది ముఖ్య పాత్ర‌. ఆరోగ్యకరమైన జీవనశైలితో వ్యాధిని ఆప‌వ‌చ్చు.

*చక్కెర, మైదాతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

* రోజూ ఒక గ్లాసు క్యారెట్, బీట్‌రూట్, పాలకూర రసం లేదా ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం తాగాలి. ఇవి శక్తివంతమైన లివర్ క్లెన్సర్లు.

*పాలు, మాంసాహర వంటలు, ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు కాలేయ పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటే మంచిది