Karthi: వాళ్లకి PS-1 అర్థంకాలేదు
Hyderabad: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వం వహించిన తాజా సినిమా పొన్నియన్ సెల్వన్ 2(Ponniyin selvan 2). పొన్నియన్ సెల్వన్-1(Ponniyin selvan 1). సినిమాకి సీక్వెల్గా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రాబోతుంది. కాగా చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్లతో బిజీబిజీగా ఉంది. అయితే దక్షిణాదిన పెద్ద హిట్ అయిన పొన్నియన్ సెల్వన్-1 సినిమా హిందీ వాళ్లకు ఎందుకు నచ్చలేదనే విషయంపై హీరో కార్తీ(Karthi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ‘పొన్నియన్ సెల్వన్ మొదటి భాగంలో చాలా పాత్రలు ఉండటం వల్ల హిందీ ప్రేక్షకులు అర్థం చేసుకోవడం కష్టమైంది. నిజానికి ఎక్కువ పాత్రలు ఉన్న ఓ నవల చదువుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది. పదవ పేజీకి వచ్చేసరికి కొన్ని పాత్రలు మర్చిపోతాం. కానీ పీఎస్-1 ఓటీటీలో విడుదలైన తర్వాత ఆడియన్స్ సినిమాను చక్కగా అర్థం చేసుకున్నారు. అందువల్ల సీక్వెల్ ఇంకా బాగా అర్థం అవుతుంది. హిందీ ఆడియన్స్కు కూడా పీఎస్-2 ఈజీగా అర్థమవుతుంది’ అని చెప్పుకొచ్చారు కార్తీ.
ప్రస్తుతం పీఎస్-2 రిలీజ్కు ముందే ఓ రికార్డ్ కొట్టేసింది. 4DX ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి దక్షిణాది చిత్రంగా పొన్నియిన్ సెల్వన్-2 (PS-2) రికార్డ్ సృష్టించినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో పాటు ఈ చిత్రాన్ని IMAX ఫార్మాట్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇది థియేటర్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. ఇక ఈ సినిమాలో విక్రమ్ (Vikram), ఐశ్వర్య బచ్చన్ (Aishwarya Rai Bachchan), జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి పాపులర్ నటులు భాగమవడంతో భారీ అంచనాలు ఉన్నాయి.