నిన్న మిస్సైన‌ TMC ఎమ్మెల్యే.. నేడు BJPలో చేరుతాడ‌ట‌!

Delhi: సీనియ‌ర్ తృణ‌మూల్ కాంగ్రెస్(tmc) నేత ముకుల్ రాయ్(mukul roy) వ్య‌వ‌హారం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. టీఎంసీ(tmc) పార్టీ వ్యవ‌స్థాప‌కుల్లో ఒక‌రైన ముకుల్ రాయ్ మొన్న రాత్రి నుంచి క‌నిపించ‌కుండాపోయార‌ని ఆయ‌న కుమారుడు నిన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. కాగా.. నిన్న సాయంత్రం ప్ర‌త్య‌క్షమైన ముకుల్‌.. మ‌ళ్లీ బీజేపీలోకి వెళ్తాన‌ని అంటున్నారు.
అస‌లు విష‌యం ఏంటంటే.. ముకుల్ టీఎంసీని స్థాపించిన‌ప్పుడు ఆ పార్టీలో నిజాయ‌తీగా ప‌నిచేసారు. ఆ త‌ర్వాత 2017లో బీజేపీలో చేరారు. 2011లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచారు. మ‌ధ్య‌లో ఏమైందో ఏమో తెలీదు కానీ.. బీజేపీలో రాజీనామా చేయ‌కుండానే మ‌ళ్లీ టీఎంసీలో చేరారు. అయితే మొన్న సోమ‌వారం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సిన ముకుల్ క‌నిపించ‌కుండాపోయారు. దాంతో ఆయ‌న కుమారుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఇవ‌న్నీ బీజేపీ చెత్త పాలిటిక్స్ అని త‌న తండ్రిని అడ్డంపెట్టుకుని నాట‌కాలు ఆడుతున్నార‌ని ముకుల్ కుమారుడు ఆరోపించారు.

నిన్న సాయంత్రం ముకుల్ ఆచూకీ తెలిసింది. ఆయ‌న సొంత ప‌నిమీద దిల్లీలోనే ఉన్నార‌ట‌. అయితే ఇప్పుడు మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చి.. “నా మాన‌సిక ఆరోగ్యం బాగానే ఉంది. నేను టీఎంసీలో ఉండ‌ను. బీజేపీలోకి మ‌ళ్లీ వెళ్ల‌డానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా కుమారుడు కూడా టీఎంసీని వ‌దిలి బీజేపీలో చేరితే బాగుంటుంది” అని తెలిపారు. అయితే త‌న తండ్రికి పార్కిన్స‌న్స్ వ్యాధి, మ‌తిమ‌రుపు ఉన్న‌ట్లు ముకుల్ కుమారుడు మీడియాకు వెల్లడించారు.