Adipurush: రిలీజ్‌కు ముందే రికార్డు!

Hyderabad: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మైథాలిజికల్ మూవీ ఆదిపురుష్(Adipurush). ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నాగే కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమా విడుదల కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ సినిమాని జూన్ 16న ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు మేకర్స్​.

మొదలు పెట్టినప్పటినుంచి అనేక వివాదాలను ఎదుర్కొంటున్న ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన గౌరవం దక్కించుకుంది. రిలీజ్​ కాకుండానే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రీమియర్ కాబోతుంది. న్యూయార్క్ లో జరగబోయే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ (Tribeca Film Festival) లో ఆదిపురుష్ ప్రీమియర్ వేయనున్నారు. జూన్ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ని జూన్ 13న ప్రదర్శించనున్నారు. రిలీజ్ కి ముందే గ్లోబల్ స్టేజ్ పై ప్రదర్శితం కానుండడం ఆదిపురుష్ టీమ్​కి దక్కిన గౌరవం. ఈ సినిమాని దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో టీ-సిరీస్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్​ ప్రముఖ డైరెక్టర్​ ఓం రౌత్(Om Raut) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.