Agent: హాలీవుడ్​ రేంజ్​లో ట్రైలర్.. అదిరిపోయిందిగా!​

Hyderabad: టాలీవుడ్​ యంగ్​ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) తాజాగా నటించిన సినిమా ‘ఏజెంట్’(Agent). ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) తెరకెక్కించారు. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయన్​ కాగా, మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్​ ప్రారంభించిన మేకర్స్​ ‘ఏజెంట్’ ట్రైలర్ (Agent Trailer) లాంచ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్​ యాక్షన్ సీక్వెన్స్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

‘ఎందుకు ఏజెంట్ కావాలనుకుంటున్నావ్?’ అనే మమ్ముట్టి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. సురేందర్ అంటేనే స్టైలిష్ టేకింగ్‌కు పెట్టింది పేరు. ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎంటర్‌టైన్మెంట్ మిస్ కాకుండా ట్రైలర్ కట్ చేశారు. మొత్తానికి అఖిల్‌ను స్టైలిష్‌ అండ్ వైల్డ్‌గా ప్రజెంట్ చేస్తూనే కాస్త కామిక్ టచ్ కూడా యాడ్ చేశాడు డైరెక్టర్. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే’ అని అఖిల్ క్యారెక్టర్‌ను మమ్ముట్టి రివీల్ చేసే డైలాగ్‌తో పాటు ‘నీచ్ కమీన్ కుత్తే పనులు చేయడానికి చాలా గట్స్ కావాలి’ అంటూ అఖిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. చివరలో అఖిల్ ఒంటిపై బుల్లెట్స్ దండ వేసుకుని గన్‌తో ఫైరింగ్ చేసే సీన్ అయితే నెవర్​ బిఫోర్​ అన్నట్లు ఉంది. మొత్తానికి హాలీవుడ్​ రేంజ్​లో అఖిల్​ని తెరకెక్కించారు సురెందర్​ రెడ్డి. ఇక ఈ ట్రైలర్​ రిలీజైన 12 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్​ సాధించి యూట్యూబ్​ ట్రెండింగ్​లో కొనసాగుతోంది.