IPL: ధోనీ కోసం బైక్ అమ్మేసా.. విరాట్ కూతురితో డేటింగ్!

Hyderabad: ఐపిఎల్ (ipl) మ్యాచ్‌ల సంగ‌తి ఏమో కానీ.. మ్యాచ్‌లు చూడ‌టానికి వ‌స్తున్న జ‌నాలు మాత్రం ప్లకార్డుల‌తో వైర‌ల్ అవుతున్నారు. దాంతో ఐపీఎల్‌(ipl)ని క‌వ‌ర్ చేస్తున్న కెమెరామెన్‌లు మ్యాచ్‌ల‌పై ఎంత ఫోక‌స్ పెడుతున్నారో.. ఆడియ‌న్స్ తెస్తున్న వింత ప్లకార్డుల‌పై అంతే ఫోక‌స్ పెడుతున్నారు. అలా ఇప్ప‌టివ‌ర‌కు బాగా ట్రెండ్ అయిన ప్ల‌కార్డులు ఇవే..!

నిన్న జ‌రిగిన సీఎస్‌కే, ఆర్సీబీ ఉత్కంఠ పోరులో ఓ యువ‌కుడు ప‌ట్టుకున్న ప్లకార్డ్ వైరల్‌గా మారింది. అత‌డు సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వీరాభిమాన‌ట‌. కానీ మ్యాచ్ టికెట్‌కు, గోవా నుంచి చెన్నై రావ‌డానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో త‌న వ‌ద్ద ఉన్న బైక్ అమ్మేసాడ‌ట‌. కేవ‌లం ధోనీని చూడ‌టానికే నా వ‌ద్ద ఉన్న బైక్ అమ్మేసా అని ప్ల‌కార్డుపై రాసుకొచ్చాడు.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ చిన్న పిల్లాడు పట్టుకున్న ప్ల‌కార్డ్ వైరల్ అయింది. దానిపై విరాట్ కూతురు వామిక గురించి రాసాడు. వామిక‌ను నాతో డేటింగ్‌కి పంపుతారా అని రాసి ఉన్న ప్ల‌కార్డు త‌ల్లిదండ్రులు ఆ పిల్లాడి చేతిలో పెట్టాడు. దాంతో చాలా మంది నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప‌సి హృద‌యాల్లో ఇలాంటివి పుట్టించ‌కండి అంటూ కామెంట్లు పెట్టారు.

ఐటీ క్యాపిట‌ల్ అయిన బెంగ‌ళూరులో ప్ర‌స్తుతం ఇళ్లు అద్దెకు దొర‌క‌డం క‌ష్టంగా మారింది. 2 బీహెచ్‌కే ఇంటికి ఏకంగా నెల రెంటు రూ.50,000 చెల్లించాల్సిన ప‌రిస్థితి. దాంతో ఉద్యోగులు ఇళ్లు దొర‌క్క అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అతిన్ బోస్ అనే వ్య‌క్తి ఇంద్రాన‌గ‌ర్‌లో 2 బీహెచ్‌కే ఫ్లాట్ అద్దెకు కావాల‌ని ప్ల‌కార్డుపై రాసుకొచ్చాడు.

ఇవ‌న్నీ ఓ ఎత్తైతే.. ఈ ఘ‌ట‌న మ‌రో ఎత్తు. ఓ యువ‌కుడు ప్రేమించిన అమ్మాయి త‌న‌ని బ్లాక్ చేసింద‌ని ప్ల‌కార్డు ప‌ట్టుకొచ్చాడు. దానిపై.. నువ్వు చూస్తున్న‌ట్లైతే న‌న్ను అన్‌బ్లాక్ చెయ్యి అని రాసుకొచ్చాడు. ముందు ముందు జ‌రిగే మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్ల‌కార్డులు ప‌ట్టుకొస్తారో చూడాలి మ‌రి.