Veera Simha Reddy: 100 రోజుల పండగ.. ఎప్పుడో తెలుసా?

Hyderabad: అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన బ్లాక్​బస్టర్​ వీరసింహారెడ్డి(Veera Simha Reddy). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సీమ కథతో వింటేజ్ బాలకృష్ణను చూపిస్తూనే సిస్టర్ సెంటిమెంట్తో ఆడియన్స్ తో కన్నీళ్లు పెట్టించారు.

శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023లో విడుదలైన మొదటి సినిమా వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి బాలకృష్ణ కెరీర్​లో మంచి హిట్​గా నిలిచింది.

వీరసింహారెడ్డి సినిమా థియేటర్ లో రన్ అవుతోంది. ఏప్రిల్ 21తో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ 23న 100 రోజుల ఫంక్షన్ ను చిత్ర నిర్మాతలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈవెంట్ ఎక్కడ నిర్వహించనున్నారు, ఎవరెవరు హాజరుకాబోతున్నారు అనే విషయాలు త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు.

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమాలో నటిస్తున్నాడు. పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. NBK108 సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), బాలయ్యకు చెల్లెలుగా శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు.

ఈ ఇద్దరూ ఇటీవలే NBK108 సినిమా సెట్స్‌ లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం నుంచి రిలీజైన బాలయ్య ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు బాలకృష్ణ (Balakrishna).