NTR30: రచ్చ మొదలు!

Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా NTR 30. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్​ ఇచ్చిన తారక్​ తాజాగా ఈ సినిమా షూటింగ్​ని పట్టాలెక్కించేశారు. ఇక షూటింగ్​ మొదలవడమే ఆలస్యం వరుస షెడ్యూల్స్​ ముగించేస్తున్నారు కొరటాల. తాజాగా ఈ సినిమాలో తారక్​ సరసన నటిస్తున్న బాలీవుడ్​ భామ జాన్వీ కపూర్​ కూడా సెట్స్​లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్​కి విలన్​ ఎవరనే విషయంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇక ఈ ప్రశ్నకి ఈరోజు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్​.

సోషల్​ మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఈ సినిమాలో విలన్​ అంటూ ప్రకటించేశారు. తాజాగా సైఫ్​ సెట్స్​లో అడుగుపెట్టిన ఫొటోని షేర్​ చేస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది టీమ్​. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘రచ్చ మొదలైందంటూ’ సంబరపడిపోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్​ ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు.