Elon musk: చాట్ జీపీటీకి పోటీగా ట్రూత్ జీపీటీ

Hyderabad: టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్(elon musk) ఓ కొత్త ఏఐ చాట్‌బాట్‌ను తీసుకురాబోతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీ ద‌క్కించుకున్న ఏఐ టూల్ చాట్ జీపీటీ(chat gpt). దీనికి పోటీగా ఇప్ప‌టికే బింగ్(bing), బార్డ్(bard) అని వివిధ టూల్స్ వ‌స్తున్న‌ప్ప‌టికీ చాట్ జీపీటీ(chat gpt)ని అధిగ‌మించ‌లేక‌పోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎలాన్ మ‌స్క్(elon musk) ఓ టూల్‌ను తీసుకురాబోతున్నారు. అదే ట్రూల్ జీపీటీ(truth gpt). యూనివ‌ర్స్, ప్ర‌కృతిని అర్థంచేసుకునే విధంగా ఈ ట్రూత్ జీపీటీ ఉండ‌బోతోంద‌ట‌. ట్రూత్ జీపీటీ(truth gpt) భద్రతకు ఉత్తమ మార్గం భావిస్తున్న‌ట్లు తెలిపారు. యూనివ‌ర్స్‌ని అర్థం చేసుకోవడంలో శ్రద్ధ వహించే AI మానవులను నాశనం చేసే అవకాశం లేదు, ఎందుకంటే మనం కూడా ఈ యూనివ‌ర్స్‌లో భాగ‌మే అని తెలిపారు.