Ileana: తల్లికాబోతున్న ఇలియానా?
Hyderabad: గోవా బ్యూటీ ఇలియానా(ileanea) తల్లి కాబోతోందా? ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ చూస్తే అలాగే ఉంది. “త్వరలో రాబోతోంది. నిన్ను చూడాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా లిటిల్ వన్” అని క్యాప్షన్ ఇస్తూ అడ్వెంచర్ బిగిన్స్ అనే షర్ట్ ఫోటో పోస్ట్ చేసింది. దాంతో చాలా మంది నెటిజన్లు తల్లికాబోతున్నారా? అని అడుగుతున్నారు. అయితే గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌తో ఇలియానా(ileana) కొంతకాలం ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(katrina kailf) సోదరుడితో ఇలియానా డేటింగ్‌లో ఉన్నారు. వారికి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం అని కత్రినా కూడా ఓ సందర్భంలో అన్నారు. ఈ నేపథ్యంలో ఇలియానా(ileana) ఇలాంటి పోస్ట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బహుశా ఇలియానా సరోగసీ ద్వారా ఏమన్నా తల్లికావాలని అనుకుంటున్నారేమో..! ఇవన్నీ తెలియాలంటే ఆమె పెదవి విప్పాల్సిందే.