uttar pradesh: ఆరేళ్లలో 183 మంది ఎన్కౌంటర్.. న్యాయవ్యవస్థ ఏం చేస్తోంది?
Delhi: ఉత్తరప్రదేశ్(uttar pradesh)లో గ్యాంగ్స్టర్(gangster)గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్(Atiq Ahmed), అతని సోదరుడు అష్రఫ్( ను పోలీసుల సమక్షంలో ప్రయాగ్రాజ్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ముగ్గరు దుండగులు వచ్చి వారిని పోలీసుల సమక్షంలోనే కాల్చి చంపారు. అంతకు ముందు రోజే అతిక్ అహ్మద్ కుమారుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ వరుస ఘటన నేపథ్యంలో.. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ హత్య ఘటనతో 2017 నుంచి ఇప్పటి వరకు యూపీలో 183 ఎన్కౌంటర్లపై (encounters) జరిగాయాని ఓ న్యాయవాది ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో(supreme court) పిటిషన్(petition) దాఖలు చేశారు న్యాయవాది విశాల్ తివారీ. యూపీలోని స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ 2017వ సంవత్సరం నుంచి జరిగిన మొత్తం ఎన్కౌంటర్లపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడైన అసద్ని యూపీ పోలీసులు ఇటీవల ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్.. కొన్నాళ్లుగా పరారీలో ఉన్నాడు. ఈక్రమంలోనే పోలీసులు అతన్ని గుర్తించి ఎన్కౌంటర్ చేశారు. ఈనేపథ్యంలోనే అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్లపై పోలీసుల సమక్షంలోనే దుండగులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇవి రెండు రోజుల వ్యవధిలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు పెను ముప్పు అని, ఇలాంటి చర్యలు పోలీసు రాజ్యంలో అరాచకత్వానికి కారణమని పిటిషనర్ పేర్కొన్నారు. శిక్షించే అధికారం న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంటుందని.. పోలీసులే నిర్ణయాలు తీసుకుంటే.. మొత్తం న్యాయవ్యవస్థ కూలిపోతుందని తివారీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల వల్ల పోలీసు వ్యవస్థపై ప్రజల్లో భయం పెరుగుతుందని అన్నారు.