rain: హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. ఇదిగో వీడియో!
hyderabad: ఒకవైపు తీవ్రమైన ఎండలు, వడగాలులతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్(hyderabad) నగర వాసులను వర్షం మరోసారి పలకరించింది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల(hail rain) వాన కురిసింది. నాంపల్లి, హైకోర్టు, గోషామహల్, బేగంబజార్, బహదూర్ పూరా తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడగా.. చంచల్ గూడ, సైదాబాద్, చంపాపేట, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీరాబాగ్, హైదర్ గూడ తదితర ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షం కురిసింది. అనుకోకుండా ఒక్కసారిగా వర్షం రావడంతో.. వాహనదారులు, పాదచారులు తడిసిపోయారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలబడటంతో.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00