Allu Arjun: సమ్మర్​లో ఇదే నిజమైన “దసరా”!

Hyderabad: నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా నటించిన తాజా చిత్రం దసరా(Dasara). దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రూపొందించిన ఈ సినిమా శ్రీరామనవమికి  విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాని ఫుల్ మాస్ రోల్​లో నటించిన మొదటి సినిమా అయినా అభిమానులను బాగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్​లోనూ కలెక్షన్ల వర్షం కురిపించిన దసరా ఇప్పటికే 110 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాక పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, మహేష్​ బాబు.. వంటి స్టార్ హీరోలతో పాటు రాజమౌళి, సుకుమార్​ వంటి డైరెక్టర్లు కూడా చిత్రయూనిట్​ని ప్రత్యేకంగా అభినందించారు. ఇక తాజాగా దసరా సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. దసరా సినిమాని, చిత్ర యూనిట్​ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు.

‘దసరా టీం అందరికి బిగ్ కంగ్రాట్స్. ఇది బ్రిలియంట్ సినిమా. నా బ్రదర్ నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కీర్తిసురేష్, మిగిలిన టీం అంతా కూడా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. సత్యన్ గారు అద్భుతమైన కెమెరా వర్క్ ఇచ్చారు. కెప్టెన్ అఫ్ ది షిప్ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ డెబ్యూట్ డైరెక్టర్ లా అనిపించకుండా చేశాడు. ఇతని తెలివితేటలు అమోఘం. ప్రొడ్యూసర్, చిత్రయూనిట్ కి హృదయపూర్వక అభినందనలు. సమ్మర్ లోనిజమైన దసరా ఈ సినిమా’ అని ట్వీట్ చేశారు బన్నీ.